Header Banner

ఏటీఎం నుంచి మనీ విత్‌డ్రా చేస్తున్నారా? ఈ కొత్త లిమిట్స్ దాటితే చార్జిలు తప్పవు!

  Thu Feb 20, 2025 08:53        Business

ఏటీఎం నుంచి మనీ తీసుకోవడం ఈ రోజుల్లో పెద్ద సమస్య అయిపోతోంది. ఎందుకంటే.. చాలా ఏటీఎంలు సరిగా పనిచెయ్యట్లేదు. వాటి దగ్గర సెక్యూరిటీ పర్సన్ ఉండట్లేదు. దీనికి తోడు విత్‌డ్రా లిమిట్స్ కూడా గందరగోళం తెస్తున్నాయి. ఈ విత్‌డ్రా లిమిట్స్.. ప్రతీ బ్యాంకుకీ వేర్వేరుగా ఉంటున్నాయి. సాధారణంగా ఈ లిమిట్స్ రోజుకు రూ.20,000 నుంచి రూ.3,00,000 దాకా ఉంటున్నాయి. కార్డును బట్టీ వీటిని నిర్ణయిస్తారు. విత్‌డ్రా లిమిట్స్ దాటితే.. బ్యాంకులు ప్రతీ ట్రాన్సాక్షన్‌కి ఫీజు వసూలు చేస్తాయి. ఇండియాలో టాప్ బ్యాంకులుగా ఉన్న SBI, HDFC, ICICI, Axis, PNB బ్యాంకుల విత్‌డ్రా లిమిట్స్, ఛార్జీలు తెలుసుకుందాం. 

 

State Bank of India (SBI):
SBI డెబిట్ కార్డుల్లో క్లాసిక్ అండ్ మేస్ట్రో డెబిట్ కార్డ్ అయితే రోజుకు రూ.40,000 విత్ డ్రా చేసుకోవచ్చు.

SBI డెబిట్ కార్డుల్లో గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ అయితే రోజుకు రూ.40,000 విత్ డ్రా చేసుకోవచ్చు.

SBI ఇన్‌టచ్ టాప్ అండ్ గో డెబిట్ కార్డు అయితే రోజుకు రూ.40,000 విత్ డ్రా చేసుకోవచ్చు.

మై కార్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు అయితే రోజుకు రూ.40,000 విత్ డ్రా చేసుకోవచ్చు.

గోల్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు అయితే రోజుకు రూ.50,000 విత్ డ్రా చేసుకోవచ్చు.

ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు అయితే రోజుకు రూ.1,00,000 విత్ డ్రా చేసుకోవచ్చు.

SBI ఏటీఎంలలో నెలకు 5 ట్రాన్సాక్షన్స్ ఉచితంగా చేసుకోవచ్చు.

ఫ్రీ ట్రాన్సాక్షన్స్ తర్వాత కూడా విత్ డ్రా చేస్తే.. ఒక్కో ట్రాన్సాక్షన్‌కీ ఫీజు రూ.20 + GST పడుతుంది.

విదేశీ ఏటీఎం లలో ఛార్జీ రూ.100 + GST + ట్రాన్సాక్షన్ విలువలో 3.5% పడుతుంది. 

 

HDFC Bank:
ఇంటర్నేషనల్, ఉమెన్స్ అడ్వాంటేజ్, NRO డెబిట్ కార్డుకు రోజూ రూ.25,000 విత్ డ్రా చేసుకోవచ్చు.

ఇంటర్నేషనల్ బిజినెస్, టైటానియం, గోల్డ్ డెబిట్ కార్డుకు రోజూ రూ.50,000 విత్ డ్రా చేసుకోవచ్చు.

టైటానియం రాయల్ డెబిట్ కార్డుకు రోజూ రూ.75,000 విత్ డ్రా చేసుకోవచ్చు.

ప్లాటినం, ఇంపెరియా ప్లాటినం చిప్ డెబిట్ కార్డుకు రోజూ రూ.1,00,000 విత్ డ్రా చేసుకోవచ్చు.

జెట్ ప్రివిలేట్ HDFC వరల్డ్ డెబిట్ కార్డుకు రోజూ రూ.3,00,000 విత్ డ్రా చేసుకోవచ్చు.

HDFC ఏటీఎంలలో నెలకు 5 ట్రాన్సాక్షన్స్ ఉచితంగా చేసుకోవచ్చు.

ఫ్రీ ట్రాన్సాక్షన్స్ తర్వాత కూడా విత్ డ్రా చేస్తే.. ఒక్కో ట్రాన్సాక్షన్‌కీ ఫీజు రూ.21 + టాక్స్ పడుతుంది.

విదేశీ ఏటీఎం లలో ఛార్జీ రూ.125 + టాక్సులు ఉంటాయి. 

 

ICICI Bank: 
స్మార్ట్ షాపర్ సిల్వర్ డెబిట్ కార్డ్ అయితే రోజూ రూ.50,000 విత్ డ్రా చేసుకోవచ్చు.

ప్లాటినం లేదా టైటానియం డెబిట్ కార్డ్ అయితే రోజూ రూ.1,00,000 విత్ డ్రా చేసుకోవచ్చు.

ఎక్స్‌ప్రెషన్స్ డెబిట్ కార్డ్ అయితే రోజూ రూ.1,25,000 విత్ డ్రా చేసుకోవచ్చు.

కోరల్ ప్లస్ డెబిట్ కార్డ్ అయితే రోజూ రూ.1,50,000 విత్ డ్రా చేసుకోవచ్చు.

ఎక్స్‌ప్రెషన్స్ కోరల్ డెబిట్ కార్డ్ అయితే రోజూ రూ.1,50,000 విత్ డ్రా చేసుకోవచ్చు.

సఫ్ఫిరో డెబిట్ కార్డ్ అయితే రోజూ రూ.2,50,000 విత్ డ్రా చేసుకోవచ్చు.

ICICI ఏటీఎంలలో నెలకు 5 ట్రాన్సాక్షన్స్ ఉచితంగా చేసుకోవచ్చు.

ఫ్రీ ట్రాన్సాక్షన్స్ తర్వాత కూడా విత్ డ్రా చేస్తే.. ఒక్కో ట్రాన్సాక్షన్‌కీ ఫీజు రూ.20 పడుతుంది.

విదేశీ ఏటీఎం లలో ఛార్జీ రూ.105 + కన్వర్షన్ ఛార్జీలు ఉంటాయి. 

 

ఇది కూడా చదవండి: జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ కీలక నేత అరెస్ట్! పోలీసులు వెంటనే రంగంలోకి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

Axis Bank: 
రూపే ప్లాటినం, పవర్ సెల్యూట్ డెబిట్ కార్డులతో రోజూ రూ.40,000 విత్ డ్రా చేసుకోవచ్చు.

లిబర్టీ, రివార్డ్స్ ప్లస్, సెక్యూర్ ప్లస్, ఆన్‌లైన్ రివార్డ్స్, టైటానియం ప్రైమ్, టైటానియం రివార్డ్స్ డెబిట్ కార్డ్‌లతో రోజూ రూ.50,000 విత్ డ్రా చేసుకోవచ్చు.

డిలైట్, వాల్యూ ప్లస్, ప్రయార్టీ, సంపన్, ప్రెస్టీజ్ డెబిట్ కార్డ్‌లతో రోజూ రూ.1,00,000 విత్ డ్రా చేసుకోవచ్చు.

బర్గుండీ డెబిట్ కార్డుతో రోజూ రూ.3,00,000 విత్ డ్రా చేసుకోవచ్చు.

Axis ఏటీఎంలలో నెలకు 5 ట్రాన్సాక్షన్స్ ఉచితంగా చేసుకోవచ్చు.

ఫ్రీ ట్రాన్సాక్షన్స్ తర్వాత కూడా విత్ డ్రా చేస్తే.. ఒక్కో ట్రాన్సాక్షన్‌కీ ఫీజు రూ.21 పడుతుంది.

విదేశీ ఏటీఎం లలో ఛార్జీ రూ.125 ఉంటుంది. 

 

Punjab National Bank (PNB): 
డెబిట్ కార్డు రోజువారీ విత్ డ్రా లిమిట్ రూ.50,000

PNB ఏటీఎంలలో నెలకు 5 ట్రాన్సాక్షన్స్ ఉచితంగా చేసుకోవచ్చు.

ఫ్రీ ట్రాన్సాక్షన్స్ తర్వాత కూడా విత్ డ్రా చేస్తే.. ఒక్కో ట్రాన్సాక్షన్‌కీ ఫీజు రూ.20 పడుతుంది.

విదేశీ ఏటీఎం లలో ఛార్జీ రూ.150 ఉంటుంది. 

 

Bank of India (BOI): డెబిట్ కార్డు రోజువారీ విత్ డ్రా లిమిట్ రూ.50,000

BOI ఏటీఎంలలో నెలకు 10 ట్రాన్సాక్షన్స్ ఉచితంగా చేసుకోవచ్చు.

ఫ్రీ ట్రాన్సాక్షన్స్ తర్వాత కూడా విత్ డ్రా చేస్తే.. ఒక్కో ట్రాన్సాక్షన్‌కీ ఫీజు రూ.21 పడుతుంది.

విదేశీ ఏటీఎం లలో ఛార్జీ రూ.125 + 2 శాతం కరెన్సీ కన్వెర్షన్ ఛార్జీలు ఉంటాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Banks #Business #Charges #ATM